Friday, August 21, 2026
E-PAPER
Homeఖమ్మంవిద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

- Advertisement -

– రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నవతెలంగాణ-సత్తుపల్లి 

విద్య వైద్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, పేదలకు ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య అందించడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ​సత్తుపల్లిలో రూ.1.83 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎన్టీఆర్ నగర్‌లో రూ.1.43 కోట్లతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభించారు.

​శివసాయి నగర్‌లో రూ.40 లక్షలతో మున్సిపల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి భూమిపూజ చేశారు. ​కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలసి పలు సమగ్ర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ… పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఉచిత ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు ​హెల్త్ సెంటర్‌కు కావలసిన వైద్యాధికారులు, వైద్య సిబ్బంది నియామకానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో శివసాయి నగర్ ప్రజల సామాజిక అవసరాలకు తీవ్ర ఊరట లభిస్తుందన్నారు.

​వివాహాలు, శుభకార్యాలు, సామాజిక సమావేశాలకు కమ్యూనిటీ హాల్  ఉపయోగపడుతుందన్నారు. ​రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.​కార్యక్రమంలో దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ పిన్రెడ్డి శ్రీనివాస రెడ్డి, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ​జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసచారి, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్ స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు ఈ  ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -