- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని వాల్మీకి మహర్షి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన జరిగి నేటికి ఏడాది అవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కల్లూరు వార్ అశోక్, ఏంజెప్పవార్ సాయిలు చిన్న, కుల పెద్దలు కమిటీ సభ్యులు నాందేవ్ మేస్త్రి, రామ్ చందర్, పుట్టి లక్ష్మణ్, పుట్టి చందర్, గంగారం, పడాల రాములు, భక్తాపూర్ సాయిలు, కర్రే వార్ సాయన్న, దాసర్వారు బాలు, సాయబ్రావ్, మచ్కూరి వీరేశం, వాల్మీకి మహర్షి భక్తులు ముఖ్యంగా మహిళలు యువకులు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



