Friday, August 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ పండుగ

రేపు స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ పండుగ

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించనున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ హాజరుకానున్నట్లు మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కర్నె లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని సర్పంచులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్‌ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డుల ద్వారా మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయని లక్ష్మీనారాయణ తెలిపారు. కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. మండల పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు 11 వేలకుపైగా స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమానికి లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -