– సీఐటీయూ ఆధ్వర్యంలో ‘బంద్’ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-సత్తుపల్లి
ఆటో రవాణా రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 24న జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త ఆటోల బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మల్లూరు చంద్రశేఖర్, సీనియర్ మోరంపూడి పాండురంగారావు, కొలికపోగు సర్వేశ్వరరావు పిలుపునిచ్చారు. సత్తుపల్లి సెంటర్‌లోని వేంసూరు రోడ్డు ఆటో అడ్డా వద్ద కార్మికుల ఆధ్వర్యంలో బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. అనంతరం కిన్నెర వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చంద్రశేఖర్, మోరంపూడి పాండురంగారావు, కొలికపోగు సర్వేశ్వరరావు ప్రసంగించారు.
ఆటో రవాణా రంగ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రతీ ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.12 వేలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని స్పష్టం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న ఈ బంద్‌లో ఆటో డ్రైవర్లు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు కరీం, యాకోబ్, శ్యామ్, వెంకటేశ్వరరావు, కృష్ణ, సంజీవరావు, రామకృష్ణ, సంతోష్, రమణ తదితరులు పాల్గొన్నారు.



