నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలింపు/ నిల్వకు సంబంధించిన సుమారు 60 బస్తాల పిడిఎస్ బియ్యం, మొత్తం 30 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నామాని ఎస్ హెచ్ఓ ఉదయ్ కిరణ్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టుబడిన పిడిఎస్ బియ్యం గుగులోత్ శంకర్ నాయక్ కు సంబంధించినవిగా గుర్తించామన్నారు. ఆయన లప్పా నాయక్ తండాకు చెందిన వాడని, ప్రస్తుతం ఆలేరు పట్టణం శివాలయం వీధిలో నివాసముంటున్నారని చెప్పారు.
స్వాధీనం చేసుకున్న పిడిఎస్ బియ్యాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించే ప్రక్రియ చేపట్టామాని తెలిపారు. పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, తరలించడం లేదా బ్లాక్ మార్కెట్కు తరలించడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.



