Friday, August 21, 2026
E-PAPER
Homeజిల్లాలుకాంగ్రెస్‌కు రాజీనామా.. బీఆర్‌ఎస్‌లో చేరిక

కాంగ్రెస్‌కు రాజీనామా.. బీఆర్‌ఎస్‌లో చేరిక

- Advertisement -

నవతెలంగాణ – స్టేషన్‌ఘన్‌పూర్‌
రఘునాథపల్లి మండలంలోని కంచనపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య సమక్షంలో వారికి బీఆర్‌ఎస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కంచనపల్లి గ్రామ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు కొనుకటి బిక్షపతి, సీనియర్‌ నాయకులు కడుదుల రాజు, పెంతల రాజు, కొంకటి హరీష్‌, కొనుకటి పెద్ద సోమయ్య, కొనుకటి చిన్నసోమయ్య, సింగిరెడ్డి మల్లయ్య, కడుదుల ఎల్లారెడ్డి, కడుదుల సందీప్‌, పెనుగొండ చంద్రయ్య తదితరులు బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఆదరణ కొనసాగుతోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలకు బీఆర్‌ఎస్‌లో సముచిత గౌరవం ఉంటుందన్నారు. కంచనపల్లి నుంచి కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరడం పార్టీకి మరింత బలం చేకూర్చిందని, రానున్న రోజుల్లో గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో జిల్లా నాయకులు, మాజీ ఎంపీపీ ఎర్రోళ్ల కుమార్‌గౌడ్‌, మాజీ ఎంపీటీసీ గవ్వాని నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ కౌడగాని నానాజీ, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ కడుదుల విష్ణు, మాజీ మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ మున్సిపట్ల విజయ్‌, జిల్లా నాయకులు గూడ కిరణ్‌, రఘునాథపల్లి ఉపసర్పంచ్‌ ద్యావర యాకయ్య, వార్డు సభ్యులు చింతకింది నర్సింహులు, లొక్కుంట్ల సృజన్‌, జోసఫ్‌, వంగ శ్రీను, ప్యారపు రాములు, మల్లారం చెంబులింగం, నాగులగొని రాములు, గ్రామ కార్యదర్శి కడుదుల రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -