నవతెలంగాణ-కోహెడ
హుస్నాబాద్ ప్రాజెక్ట్ పరిధిలోని కోహెడ, బెజ్జంకి మండలాల్లో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 25న మంగళవారం హుస్నాబాద్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ఐసిడిఎస్ అధికారులు తెలిపారు. వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్‌తో పాటు కులం, నివాసం, విద్యార్హతలకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను రెండు సెట్ల జిరాక్స్ కాపీలుగా తీసుకురావాలన్నారు. అలాగే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. రెండు సెట్ల జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి సంతకం తప్పనిసరిగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు నిర్ణీత తేదీన అవసరమైన అన్ని ధ్రువపత్రాలతో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూపర్వైజర్ కవిత ఒక ప్రకటనలో కోరారు.
అంగన్వాడీ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



