ఏం పని లేక తిరుగుతున్నారా?
బీజేపీ ఎంపీ అర్వింద్‌కు విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రధాని మోడీ 2014లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు 82 దేశాల్లో 103 విదేశీ పర్యటనలు చేశారనీ, ఆయన ఎందుకోసం వెళ్లారు? ఏం పని లేక తిరుగుతున్నారా? ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ బీజేపీ ఎంపీ అర్వింద్‌ను ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టిన మూడేండ్లలో రెండు సార్లు దావోస్‌కు, ఒకసారి అమెరికా, దక్షిణ కొరియాకు మాత్రమే వెళ్లారని గుర్తు చేశారు. అయినా బీజేపీ నాయకులు సీఎం పర్యటనపై ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామంటూ అర్వింద్ అంటున్నారనీ, కానీ బీజేపీకి ఆ అవకాశం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. ‘అర్వింద్ గుర్తు పెట్టుకో.. తెలంగాణలో మీ ఆటలు సాగవు. ఇక్కడుంది రేవంత్ రెడ్డి.. మీ తోకలు కత్తిరించి పంపిస్తాం.. జాగ్రత్త. మా ప్రభుత్వం జోలికి వస్తే తాట తీస్తాం.బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని మాకు తెలుసు’ అని హెచ్చరించారు. గతంలో కూడా ఇలాగే ప్రయత్నించి బీఆర్ఎస్ దెబ్బతిన్నదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాల్సిన బీజేపీ ఎంపీలు చివరకు బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. దీనిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం పర్యటన రద్దు వెనుక బీజేపీ కుట్ర : ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దు వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు విమర్శించారు. పెట్టుబడుల సమీకరణ కోసం ఆయన అమెరికా పర్యటనకు పోతుంటే, మార్గ మధ్యలోనే వెనక్కి రప్పించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన రద్దుపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా దేశంలోని తెలుగువాళ్లు, అక్కడి పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధితోపాటు వారికి కల్పిస్తున్న అవకాశాలపై వారితో చర్చించేందుకు వెళ్తుతున్నారని చెప్పారు. సీఎం పర్యటనపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఉగ్రవాదుల కోసం కూడా యూనివర్సిటీలు ఉంటాయా? అని ప్రశ్నించారు.
మోడీ 82 దేశాల్లో 103 విదేశీ పర్యటనలు…ఎందుకోసం వెళ్లారు..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



