నేడు అంత్యక్రియలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రముఖ రచయిత, నాటకకర్త వాసిరెడ్డి నారాయణరావు (97 సంవత్సరాలు) శుక్రవారం హైదరా బాద్‌లో మరణించారు. బంజారా హిల్స్ లోని తన నివాసంలో శుక్ర వారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన కన్నుమూశారు. ఫిషరీస్ డిపార్ట్ మెంట్ జాయింట్ డైరెక్టర్ గా, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా వివిధ హోదాల్లో ఆయన సేవలం దించారు. ప్రముఖ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవికి ఆయన స్వయాన సోదరుడు. అంతే కాకుండా సీపీఐ(ఎం) మాజీ పొలిట్ బ్యూరో సభ్యులు, దివంగత మాకినేని బసవపున్నయ్య, లావు బాలగంగాధర రావులకు బంధువు కూడా. వణశ్రీ, నరేంద్ర, రహింసా పేర్లతో ఆయన పలు నవలలు, సంక్షిప్త కథలను రాశారు. తన చివరి శ్వాస వరకు ఆయన తన సాహిత్య వ్యాపకాలతో గడిపారు. ఆయా కార్యక్రమాల్లో నిమగ్నమ య్యారు. వాసిరెడ్డి సీతాదేవి మెమోరియల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా అనేక సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమా లను నిర్వహించారు. పలు నాటకాల పోటీలకు ఆయన న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఆయన భార్య సమ్మిబాయి, కుమారుడు తరుణ్ రెండేండ్ల క్రితం మరణించారు. అనంతరం ఆయన ఇంకో కుమారుడు వాసిరెడ్డి శ్రమణ్ దగ్గరే ఉన్నారు. శ్రమణ్ ఇండియన్ ట్రేడ్ సర్వీస్ ఆఫీసర్. హైదరాబాద్ రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ గా కూడా ఆయన సేవలందించారు. కాగా నారాయణరావు అంత్యక్రియలను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రముఖ రచయిత వాసిరెడ్డి నారాయణరావు కన్నుమూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



