Sunday, August 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబెర్లిన్‌లో అరుణోదయం

బెర్లిన్‌లో అరుణోదయం

- Advertisement -

మేయర్‌‌ ఎన్నికల్లో గెలుపుదిశగా లెఫ్ట్‌ పార్టీ అభ్యర్ధి ఒపీనియన్‌ పోల్స్‌‌లో ఆధిక్యత
వామపక్ష‍ డీ లింకెకు ప్రజల నుంచి విశేష ఆదరణ
సెప్టెంబరు 20న బెర్లిన్‌ ‌మున్సిపల్‌ ఎన్నికలు

బెర్లిన్‌ : జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఎర్ర పతాకాలు రెపరెపలాడుతున్నాయి. అక్కడ జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్ష‍ పార్టీ డీ లింకెకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. జర్మనీ పునరేకీకరణ తర్వాత, 1990లో బెర్లిన్‌ ‌గోడ బద్దలైన తర్వాత మొట్టమొదటిసారిగా లెఫ్ట్‌ పార్టీ (డీ లింకె)కి చెందిన అభ్యర్థి బెర్లిన్‌ ‌మేయర్‌గా ఎన్నిక కావచ్చు. సెప్టెంబరు 20న జరగనున్న బెర్లిన్‌ ‌మున్సిపల్‌ ఎన్నికలకు లెఫ్ట్‌ ‌పార్టీ జాబితాకు ఎలిఫ్‌ ఎరాల్ప్‌ (45) ‌నాయకత్వం వహిస్తున్నారు. సోషలిస్టు టర్కీష్‌ ‌వలసదారుల కుటుంబానికి చెందిన ఆమె తాజాగా నిర్వహించిన ఒపీనియన్‌ ‌పోల్‌‌లో ఆధిక్యంలో ఉన్నారు. లెఫ్ట్‌ ‌పార్టీ బెర్లిన్‌ ‌నగరంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం 18వేల మందికి పైగా వలంటీర్లను మోహరించింది. బెర్లిన్‌‌లో బాగా ఎక్కువగా ఉన్న ఇండ్ల అద్దెలపై, పెరుగుతున్న జీవన వ్యయ ప్రమాణాలను తగ్గించడం పట్ల పోరు సల్పడంపై పార్టీ ప్రధానంగా దృష్టి పెట్టింది. తక్కువ జీవన వ్యయానికి ఒకప్పుడు పేరు గాంచిన బెర్లిన్‌ ‌నగరంలో ఇటీవల ధరలు విపరీతంగా పెరిగిపోవడం అక్కడి ప్రజలను బాగా ఇబ్బంది పెడుతోంది. నయా నాజీ భావజాలం కలిగిన ఆల్టర్నేటివ్‌ ‌ఫర్‌‌ జర్మనీ (ఎఎఫ్‌‌డి) పార్టీకి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో వలసదారుల కుమార్తె నేతృత్వంలోని లెఫ్ట్‌ ‌పార్టీకి రాజధాని నగరంలో విజయం దక్కే అవకాశం లభించినట్లైతే అదొక మంచి పరిణామంగా భావించవచ్చు. క్రిస్టియన్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ (సీడీయూ), సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ (ఎస్పీడీ)ల కూటమి ప్రస్తుతం బెర్లిన్‌ ‌నగరాన్ని పాలిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -