Sunday, August 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కౌలస్ నాళా ప్రాజెక్టులో తగ్గిన నీటిమట్టం

కౌలస్ నాళా ప్రాజెక్టులో తగ్గిన నీటిమట్టం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
ఈ వర్షాకాలంలో రైతులు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. గత వారం రోజులుగా అడపాదడపా వర్షాలు కురిసినా.. ఎగువనుండి వరద నీరు రాకపోవడంతో కౌలాస్‌నాళా ప్రాజెక్టుకు నీటి తాకిడి తగ్గింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం 457.60 మీటర్ల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఈసారి వానాకాలం చివరి దశకు వచ్చినా కౌలాస్‌ నాళా ప్రాజెక్టు నిండకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌ పంటల గురించి అటుంచితే.. యాసంగి వరి పంటల పరిస్థితేంటని రైతులు వాపోతున్నారు. ప్రాజెక్టు నిండితేనే పొలాల్లో సిరులు కురుస్తాయని చెబుతున్నారు. మరోవైపు రైతులకు ఈ సారి వానాకాలం అంతగా కలిసి రాలేదనీ, ఆరుతడి పంటలే వేసుకోవాలని వ్యవసాయ అధికారులు ఎప్పటి నుంచో గ్రామాలలో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -