- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
కౌలాస్ నాలా ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతోందన్న సమాచారం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష‍్మీకాంతారావు ఆదివారం హుటాహుటిన హైదరాబాద్ నుంచి నేరుగా కైలాస్‌నాళా ప్రాజెక్టుకు చేరుకున్నారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు అధికారులతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆయకట్టు రైతుల సౌకర్యార్ధం, ప్రజల భద్రత మేరకు వెంటనే నీటి మళ్లింపు చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



