నవతెలంగాణ- మాదాపూర్
గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే భవనం కూలిపోయిన ఘటనతో అప్రమ త్తమైన అధికారులు, డ్యామేజ్ అయిన పక్క భవనాన్ని కూల్చి వేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం భారీ బాహుబలి యంత్రాన్ని ఘటనా స్థలానికి తరలించారు. ఆరు అంతస్తుల భవనం కూల్చివేతకు అధి కారులు ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ, వర్షం కారణంగా పనులకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడింది. వర్షం తగ్గిన వెంటనే కూల్చివేత పనులు ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, నాలాకు ఆనుకుని నిర్మించిన మరో నాలుగు భవనాల్లో నివాసం ఉంటున్న వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ప్రమాదకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
అంజయ్యనగర్‌లో భారీ కూల్చివేతకు సిద్ధమైన అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



