ఈ నెల 14 లోపు ఆన్ లైన్ పూర్తి చేయాలి: డిఎల్పీఓ రాజీవ్ కుమార్

నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు హామీల పథకాల్లో భాగంగా ఇటీవల అయిదు హామీల కోసం స్వీకరించిన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను ఈ నెల 14 లోపు పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు డిఎల్పీఓ రాజీవ్ కుమార్ సూచించారు. మంగళవారం స్థానిక తాహసీల్దార్, ఎంపిడిఓ కార్యాలయాల్లో జరుగుతున్న దరఖాస్తుల ఆన్లైన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ అవసరమైన మేరకు డేటా ఆపరేటర్ లను నియమించుకుని త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ఇప్పటి వరకు సుమారు 8 వేల దరఖాస్తులు ఆన్ లైన్ చేసినట్లు తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ తెలిపారు. అనంతరం మేజర్ పంచాయితీ అశ్వారావుపేట తో పాటు అచ్యుతాపురం,నందిపాడు పంచాయతీలలో పారిశుధ్యం పనులు పరిశీలించారు. వీరి వెంట ఎంపిడిఓ జి.శ్రీనివాసరావు, ఎం పీ ఈ ఓ సీతారామరాజు, ఈఓ గజవెల్లి హరికృష్ణ తదితరులు ఉన్నారు.
Spread the love