ప్రశాంత్ వర్మ, ఆర్కేడీ స్టూడియోస్, పూజా కొల్లూరు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీవీసీయూ (PVCU) మోస్ట్ అవైటెడ్ హిస్టారికల్ స్పెక్టకిల్ ‘మహాకాళి’ నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. #శుక్రాచార్య వార్ క్రై’ పేరుతో విడుదలైన ఈ గ్లింప్స్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. 2027 జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా ‘మహాకాళి’ థియేటర్లలోకి రానుంది.
ధర్మం, అధర్మం మధ్య జరిగే మహా సంగ్రామాన్ని ఈ గ్లింప్స్ ప్రజెంట్ చేస్తోంది. ఇది కేవలం మంచి-చెడు మధ్య జరిగే పోరాటం కాదని, ఓ ప్రపంచ భవిష్యత్తునే నిర్ణయించే స్థాయిలో యుద్ధం ఉండబోతుందనే ఆసక్తిని కలిగిస్తోంది. అసురుల గురువు శుక్రాచార్యుడి నాయకత్వంలో జరిగే ఈ పోరాటం మరింత పెద్ద యుద్ధానికి దారితీస్తున్నట్లు గ్లింప్స్‌లో చూపించారు. “ది ఎండ్ బిగిన్స్” గా మహా సంగ్రామానికి నాంది పలికారు. గ్లింప్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది అక్షయ్ ఖన్నా. శుక్రాచార్యుడిగా ఆయన కొత్త అవతార్‌లో కనిపించారు. ఇంటెన్స్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆయన పాత్రపై ఆసక్తిని మరింత పెంచారు అని మేకర్స్ చెప్పారు.
చెడుపై మంచి చేసే పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



