Tuesday, August 25, 2026
E-PAPER
Homeసినిమాఆద్యంతం వినోదభరితం

ఆద్యంతం వినోదభరితం

- Advertisement -

అల్లరి నరేష్ తాజాగా నటిస్తున్న ఫాంటసీ కామెడీ ఎంటర్‌ టైనర్‌ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 4న విడుదల కానుంది. సోమవారం హీరో నాగార్జున ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు.
సూరి(అల్లరి నరేష్) మొక్కుబడులతో భూలోకానికి దిగివచ్చిన రంభ, ఊర్వశి, మేనకలు.. తమ దివ్య శక్తులను కోల్పోవడంతో అసలు కథ మొదలవుతుంది. ముగ్గురు అప్సరసలు తన ఇంట్లో ఉండటంతో సూరికి ఎదురయ్యే ఇబ్బందులు, అతడి ప్రేయసి గొడవ, పోలీసుల విచారణ, మరోవైపు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న తల్లి.. ఇలా వరుస సమస్యలతో కథలో ఎంటర్టైమెంట్ ని ట్రైలర్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది. ట్రైలర్‌ను దర్శకుడు చంద్ర మోహన్ చింతాడ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా నడిపించారు. ముఖ్యంగా అల్లరి నరేష్, నరేష్ వీకే మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. సోషల్ మీడియాలో పాపులర్ అయిన ‘లవ్ యూ బచ్చెస్’ డైలాగ్‌ను కూడా ఫన్నీగా ఉపయోగించారు. ‘ఓజీ’లోని జపనీస్ డైలాగ్‌ను సరదాగా వాడిన విధానం ట్రైలర్‌కు మంచి కామెడీ ఎండింగ్ ఇచ్చింది అని చిత్ర బృందం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -