Tuesday, August 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి 

శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని, ఆలేరు సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కిరణ్ అన్నారు. నవతెలంగాణతో మంగళవారం ఆయన మాట్లాడారు. వరంగల్ ,హైదరాబాద్ జాతీయ రహదారి హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నామనీ, రోడ్డు నిబంధనలు ప్రతి వాహనదారుడు పాటించాలన్నారు. ఆలేరు  పరిధిలోని, గ్రామాలల్లో ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలన్నారు. తద్వారా నేరాల నియంత్రణతో పాటు, దొంగతనాలు అరికట్టొచ్చని చెప్పారు.

నేరాల అదుపునకు, శాంతి భద్రత నెలకొల్పేందుకు, సీసీటీవీల పాత్ర కీలకమన్నారు. సీసీటీవీల ఏర్పాటుకు పట్టణ, గ్రామాలలో ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, ఈ ప్రాంతంలో చదువుకొని వ్యాపారాలు చేస్తూ..ఉన్నత స్థితిలో ఉన్నవారు, ఉద్యోగాలు పొంది వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న వారి సహకారంతో సిసీ టీవీల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. యువత చిన్న సిగరెట్ తో మొదలై, డ్రగ్స్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకి దూరంగా ఉండాలని , యువకులు చెడు మార్గాల వైపు ఆకర్షితులు కావొద్దు అన్నారు. డ్రగ్స్, గంజాయి గురించి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -