– డిప్యూటీ ఎమ్మార్వో హేమలత
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ముప్పై గ్రామ పంచాయతిలలో బిఎల్ వోలు ప్రణాళిక బదగా విధులు నిర్వహించాలని జుక్కల్ డిప్యూటీ తాసిల్దార్ హేమలత అన్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయంలో జిపిఓలు, బిఎల్వోలు సర్ ప్రక్రియపై గ్రామంలో నిర్వహించాల్సిన విధి విషయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డిప్యూటి తహసిల్దార్ హేమలత మాట్లాడుతూ.. ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చబడిన అన్ని ఓటర్ల పేర్లను బూత్ లెవల్ ఆఫీసర్ బహిరంగంగా చదివి వినిపించాలి.
1)ఏ కారణం చేతనైనా ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు చేర్చబడకుండా మిగిలిపోయిన భారతీయ పౌరుల వివరాలను గుర్తించాలి.
2)01.10.2026 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకునే భారతీయ పౌరులు, తమ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఫారం-6తో పాటు డిక్లరేషన్ ఫారం మరియు అవసరమైన పత్రాలను సమర్పించమని కోరాలి.
3)ముసాయిదా ఓటర్ల జాబితాలో ఏదైనా తప్పు/వ్యత్యాసం (Discrepancy) గుర్తించబడితే, సంబంధిత వ్యక్తి ఫారం-8తో పాటు డిక్లరేషన్ ఫారం మరియు అవసరమైన ఆధార పత్రాలను సమర్పించమని కోరాలి.
4)ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చబడినప్పటికీ, ఏ కారణం చేతనైనా ఓటరుగా ఉండేందుకు అనర్హులైన వ్యక్తులను గుర్తించాలి. సంబంధిత వ్యక్తి అదే నియోజకవర్గంలో ఓటరుగా ఉండి, డిక్లరేషన్ ఫారంతో పాటు ఫారం-7ను సమర్పించాలి.
5)క్లెయిమ్‌లు, అభ్యంతరాలు మరియు ధృవీకరణకు నిర్దేశించిన కాలంలో, భారత ఎన్నికల సంఘం (Election Commission of India) నిర్దేశించిన మరియు అవసరమైన పత్రాలకు సంబంధించి చర్చ నిర్వహించాలి.
6)ఎలక్టోరల్ రోల్‌కు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR)లోని ఇతర అంశాలను కూడా చర్చించాలి.
పై అంశాలను సమావేశపు మినిట్స్‌లో నమోదు చేసి, అధికారిక రికార్డు నిమిత్తం భద్రపరచేలా చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఆర్ఐ, సీనీయర్ అసిస్టెంట్ మాహన్, సిపి శ్రీనివాస్, సుజాతా, సుమలత, అన్నీ గ్రామాల జీపీఓలు, బిఎల్వోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



