Tuesday, August 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోన్గాం గ్రామంలో వనమహోత్సవం

డోన్గాం గ్రామంలో వనమహోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని డోన్గావ్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతి ఒక్కరు ఆరు మొక్కలు నాటాలని సూచించారు. ఇంటి ఆవరణలో ఖాళీ స్థలాలలో ప్రతి ఒక్కరు ఆరు మొక్కలు నాటి రాబోయే తరానికి మనం మార్గదర్శకులుగా ఉండాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ తో పాటు ఉపసర్పంచ్ జిపి కార్యవర్గ సభ్యులు, జిపి కార్యదర్శి,  జిపిఓలు, గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -