Tuesday, August 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీలక్ష్మి మండల సమాఖ్య నూతన కమిటీ నియామకం

శ్రీలక్ష్మి మండల సమాఖ్య నూతన కమిటీ నియామకం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
శ్రీలక్ష్మీ మండల సమాఖ్య నూతన కమిటీని నియామకం చేసినట్లుగా మండల ఐకెపి ఏపీఎం హనుమంతరావు తెలిపారు. మంగళవారం మండలంలోని  కొయ్యుర్ గ్రామంలోని శ్రీలక్ష్మీ సమాఖ్య మండల కార్యాలయంలో గ్రామైఖ్య సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వశక్తి మహిళల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చా నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించినట్లుగా ఈ సంవత్సరం మండల సమాఖ్య సంఘం మండల కమిటీని ఎన్నుకొన్నారు. అధ్యక్షురాలుగా సౌజన్య, కార్యదర్శిగా సునీత, కోశాధికారిగా సుజాతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిసిలు, స్వశక్తి మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -