నవతెలంగాణ-ఆలేరు టౌను
విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి యువతని నడుం బిగించాలని, శ్రీరామకృష్ణ విద్యాలయం కరస్పాండెంట్ కవి, రచయిత బండి రాజుల శంకర్ అన్నారు. ఆలేరు పట్టణంలో మంగళవారం ఆలేరు శ్రీరామకృష్ణ విద్యాలయం కరస్పాండెంట్ ,కవి బండిరాజుల శంకర్ శతక సంపుటి ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య చెన్నప్ప సభాధ్యక్షులుగా, ప్రముఖ సాహితీ వేత్త, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి ముఖ్య అతిథిగా ప్రముఖ కవులు డాక్టర్ లింగంపల్లి రామచంద్ర, డాక్టర్ భేరి సునీతా రామోహనరెడ్డి, బసల చేన్నప్ప, కస్తూరి లక్ష్మీనారాయణ, పాలకుర్తి రామ్మూర్తి, అతిథులుగా, డాక్టర్ పాండాల మహేశ్వర్ పుస్తక సమీక్షకులుగా హాజరయ్యారు.
సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అతిధులకు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాసం, పద్యం, రచనలు సమాజాన్ని చైతన్య పరుస్తాయని పేర్కొన్నారు. కృషి పట్టుదలతో ఉన్నత శిఖరాలు నేటి యువత అధిరోహించాలన్నారు. చిన్నారులు నృత్యంతో అలరించారు. తేజ సాహిత్య సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పోరెడ్డి రంగయ్య కార్యక్రమ సమన్వయం సమన్వయకర్తగా వ్యవహరించారు. విజయ్ కుమార్, సోమిరెడ్డి ,నర్సిరెడ్డి , జగన్మోహన్, కృష్ణ హరి,బొట్ల సంపత్, శ్రీనివాస్ రెడ్డి, సాహితీవేత్తలు,కవులు,సాహిత్యాభిమానులు అధిక సంఖ్యలో పుస్తకావిష్కరణ సభలో పట్టణపుర ప్రముఖులు, వ్యాపారవేత్తలు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



