- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని పేర్కిట్లో నిర్వహించినమిలాద్ ఉన్ నబీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి బుధవారం పాల్గొన్నారు. మత గురువుల సమక్షంలో ఫాతిహా ఖానీ నిర్వహించిన అనంతరం అంజద్ ఖాన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ను పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త మహమ్మద్ (స) బోధించిన శాంతి, సోదరభావం, మానవత్వం, ఐక్యత వంటి విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆకాంక్షించారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పరస్పర సోదరభావంతో, ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
- Advertisement -



