- Advertisement -
నవతెలంగాణ–మద్నూర్: చెట్లు ఉంటేనే మానవుని మనుగడ సాధ్యమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, నాటిన మొక్కలను సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ సందీప్ కుమార్, పంచాయతీ బిల్ కలెక్టర్ ఆంజనేయులు, పలువురు పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



