Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వీబీజీ రామ్‌జీ పనులపై అవగాహన

వీబీజీ రామ్‌జీ పనులపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండల పరిధిలోని తిరుగండ్లపల్లి గ్రామంలో మంగళవారం సర్పంచ్‌ పందుల లక్ష‍్మమ్మ-జంగయ్య అధ్యక్ష‍తన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ మున్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వికసిత్‌ భారత్‌, వీబీజీ రామ్‌జీ పథకం చేపట్టే పనుల ప్రణాళిక (విజిపిపి) పై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ మేరకు ఆ పథకం కింద చేపట్టబోయే పనులు, చేసే విధానంపై సంబంధిత అధికారులు ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రవికుమార్, ఏపీఓ జయరాజ్, ఏపీఎం అద్దంకి వెంకట్, ఈసీ వివేక్, గ్రామ సంబంధిత అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -