కాటారం కలెక్టర్ కు విన్నవించిన భూ నిర్వాసితులు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ఓసీపీకి 500 మీటర్లు డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లకు, భూములకు త్వరగా పరిహారం, ప్యాకేజి ఇప్పించాలని గ్రామ సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, భూ నిర్వాసితులు ఇటీవల కాటారం సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి మంగళవారం మల్హర్ మండల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన సౌరబ్ శర్మను శాలువాతో సత్కారం చేసి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు సర్వే నిర్వహించి నెలరోజులు దాటుతున్న పరిహారం ఉసేలేదని, వెంటనే పరిహారం ఇవ్వాలని కోరారు.
తాము నిత్యం ఓసిపి దుమ్ము, దులికి ఇబ్బందులకు గురివుతున్నట్లుగా వాపోయారు. ప్రభుత్వం రూ.261 కోట్లు కలెక్టర్ ఖాతాలో వేసిన ఇదుగో పరిహారం అదిగో పరిహారం అంటూ కాలయాపన చేయడం సరికాదన్నారు. పదిహేనేళ్లుగా పరిహారం కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తూ ఇప్పటికే కొందరు నిర్వాసితులు మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సబ్ కలెక్టర్ స్పందిస్తూ తాను ఆ పనిపైనే వచ్చానని తీవ్రలోనే పరిహారం అందేలా కృషి చేస్తానన్నారని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. అనంతరం మండలంలో భూ సమస్యలపై తహశీల్దార్ రవికుమార్, జిపిఓ గొట్టం నరేశ్ లను అడిగి సబ్ కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం ఉపాధ్యక్షుడు బండి రాజయ్య, దన్నపనేని అశోక్ రావు, రామిడి గట్టయ్య, ఆర్ని సత్తయ్య, కేశారపు చెంద్రయ్య, బూడిద రాజ సమ్మయ్య, అజ్మతి అలీ, పాల్గొన్నారు.



