Wednesday, August 26, 2026
E-PAPER
Homeఖమ్మందమ్మపేట పోలీస్ స్టేషన్‌లో పాల్వంచ ఎస్‌డీపీవో వార్షిక తనిఖీ

దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో పాల్వంచ ఎస్‌డీపీవో వార్షిక తనిఖీ

- Advertisement -

– మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యం
– ఎస్డీపీఓ సతీష్ కుమార్ 
నవతెలంగాణ – అశ్వారావుపేట

దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో పాల్వంచ ఎస్‌డీపీవో సతీష్ కుమార్ బుధవారం వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని సిబ్బంది హాజరు, కిట్ సామాగ్రి, స్టేషన్ ఆవరణ, నేరాలకు సంబంధించిన వాహనాలు, స్టేషన్ రికార్డులు, సీసీటీఎన్ఎస్, సైబర్ క్రైమ్ పనితీరును ఆయన సమీక్షించారు. ఆన్‌లైన్‌లో ఎలాంటి పనులు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలని, తమకు అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. అలాగే  ఈ-సాక్ష్య,ఆన్సైట్ ఎఫ్ఐఆర్ పనితీరును మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. కోర్టు కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, గంజాయి వినియోగదారులను గుర్తించి వ్యసన విముక్తి కేంద్రాలకు పంపించాలని ఎస్‌డీపీవో సతీష్ కుమార్ సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ వార్షిక తనిఖీలో అశ్వారావుపేట సీఐ నాగరాజు, దమ్మపేట ఎస్‌హెచ్‌ఓ ఎస్సై బి. రాజేష్‌తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -