రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
నవతెలంగాణ-ఆలేరు టౌన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం, ప్రతి నిరుపేద కుటుంబానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరు పట్టణంలో బుధవారం కాటమయ్య నగర్ లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
ఆలేరు నియోజకవర్గం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు పార్టీ సభ్యులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య , బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బిర్లా అనిత దంపతులకి, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఏ ఆంజనేయులు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కే సాగర్ రెడ్డి ,మాజీ అధ్యక్షులు ఎంఏ ఎజాస్, కౌన్సిలర్ జూకంటి సంపత్, పార్టీ నాయకులు మల్లెల శ్రీకాంత్, గడ్డమీది సాయిరాం, పర్రె రమేష్, అందే అఖిల్ సభ్యుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



