నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రజలకు హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ(టీజీఎస్‌ఏసీఎస్) ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో గల లలితా కళాతోరణంలో రాష్ట్ర స్థాయి జానపద కళారూపాల ప్రదర్శనలను నిర్వహించారు. ఈ ప్రదర్శనల్లో 20 జానపద బృందాలకు చెందిన వంద మంది కళాకారులు పాల్గొన్నారు. ఎయిడ్స్ నివారణ, అవగాహన, చికిత్స, హెచ్ఐవీ సంబంధిత సేవల లభ్యతపై ముఖ్యమైన సందేశాలను తెలిపేలా పల్లె సుద్దులను ప్రదర్శించారు. టీజీఎస్ఏసీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. విద్యాసాగర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేస్తున్న జానపద కళాకారులను అభినందించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలను ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడంలోనూ, చైతన్యపర్చడంలోనూ జానపదకళాకారుల పాత్ర కీలకమన్నారు.
ఎయిడ్స్ నియంత్రణపై జానపద కళారూపాల ప్రదర్శన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



