Thursday, August 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరూ. 85లక్షలు కాపాడిన ఎన్సీఆర్పీ

రూ. 85లక్షలు కాపాడిన ఎన్సీఆర్పీ

- Advertisement -

 డిజిటల్‌ అరెస్టులను నమ్మొద్దు : శిఖాగోయల్‌
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

ఒక వృద్ధుడిని మోసగించి రూ.85 లక్షలు టోకరా వేసిన సైబర్ మోసగాళ్ల కుట్రలను నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ సకాలంలో అడ్డుకుంది. తెలంగాణ సైబర్‌ ‌క్రైమ్‌ ‌పోర్టల్‌ ‌డీజీపీ శిఖా గోయల్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుమెట్ ప్రాంతానికి చెందిన వృద్ధుడికి సైబర్ మోసగాడు వీడియో కాల్ చేశాడు. ‌‘నిన్ను డిజిటల్‌ అరెస్టు చేశాం..ఎక్కడికి కదల వద్దంటూ సైబర్‌ ‌ఫ్రాడ్‌ ఆదేశించాడు. నీ ఆధార్ కార్డులు ఉపయోగించి దేశంలోని వివిధ బ్యాంకులలో లక్షల రూపాయల మోసం జరిగిందనీ, దానిపై ఆర్బీఐ విచారణ సాగిస్తున్నది. ఈ విచారణ ముగిసేంతవరకు రూ. 85 లక్షల ను పంపించాలని ఆదేశించాడు. విచారణ అనంతరం ఆ డబ్బులను వాపసు చేయడం జరుగుతుందని ఆ మోసగాడు నమ్మబలికాడు. దాంతో ఆ వృద్ధుడు రూ.85. 25 లక్షల రూపాయలను మోసగాడు చెప్పిన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశాడు. మరి కొద్దిసేపటికి మరో 45 లక్షల రూపాయలు కావాలని ఆ మోసగాడు తెలుపగా వృద్ధుడికి అనుమానం కలిగింది. దీంతో వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కు సమాచారాన్ని అందించాడు’ అని ఆమె తెలిపారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ నేర విచారణ అధికారులు దర్యాప్తును సాగించి మోసగాడి ఆచూకిని కనుగొన్నామన్నారు. అలాగే వృద్ధుడు ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంక్‌ అకౌంట్ కు 85.25 లక్షలు వెళ్లకుండా మధ్యలోనే అడ్డుకున్నామని చెప్పారు. డిజిటల్ అరెస్టుల పేరిట లేదా పోలీసులమంటూ వచ్చే కాల్స్ ను ఎవరు నమ్మవద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -