నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నేపాల్‌లో సంభవించిన భారీ వరదల కారణంగా అక్కడ చిక్కుకున్న లేదా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. నేపాల్‌లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అక్కడ ఉన్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ , సమన్వయ కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేపాల్‌లో ఉన్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందిం చేందుకు తెలంగాణ భవన్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో పాటు ఇతర సంబం ధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు. నేపాల్‌లో ఉన్న తెలంగాణకు చెందిన యాత్రికులు, పర్యాటకులు, ఇతర వ్యక్తులతో సంప్ర దింపులు జరపలేకపోతున్న వారి కుటుంబ సభ్యులు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. సహాయక చర్యల సమ న్వయాన్ని సులభతరం చేసేందుకు సంబంధిత వ్యక్తుల పేరు, పాస్‌పోర్ట్ వివరాలు, మొబైల్ నంబర్, నేపాల్‌లో ప్రస్తుతం ఉన్న లేదా చివరిగా తెలిసిన ప్రాంతం, ట్రావెల్/టూర్ ఆపరేటర్ వివరాలు, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలను హెల్ప్‌లైన్ అధికారులకు అందించాలి. నేపాల్‌లో ఉన్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు హెల్ప్‌లైన్ అధికారులు అందుబాటులో ఉంటారు. హెల్ప్‌లైన్‌కు అందే విజ్ఞప్తులను ప్రాధాన్యతా ప్రాతిపదికన సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన సహాయం అందించేందుకు సమన్వయం చేస్తారు. నేపాల్‌లోని పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన తదుపరి చర్యలను సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటుంది.హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే… 1.వందన పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్ అండ్ లైజన్ హెడ్ మొబైల్ నెంబర్: 9871999044 2. సి.హెచ్. చక్రవర్తి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మొబైల్: 9949351270 3. జి.రక్షిత్ నాయక్ లైజన్ ఆఫీసర్ మొబైల్: 9618597969
‘నేపాల్’ బాధితుల కోసం హెల్ప్‌లైన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



