వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్
సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్‌పామ్ హబ్ ఏర్పాటుకు రిలయన్స్ ఆసక్తి
కోదాడ–హుజూర్‌నగర్ నుంచే ఆయిల్‌పామ్ విస్తరణకు శ్రీకారం
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలనూ అనుసంధానం
మంత్రులు ఉత్తమ్, తుమ్మలతో రిలయన్స్ కన్జ్యూమర్
ప్రతినిధుల భేటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నీటిని అధికంగా వినియోగించే వరి సాగుపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తూ, రైతులకు స్థిరమైన, లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగుకు భారీ ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించింది. ఆయిల్‌పామ్ తోటల విస్తరణతోపాటు ప్రాసెసింగ్, రిఫైనింగ్, అనుబంధ పరిశ్రమలను ఒకే గొలుసులో అనుసంధానిస్తూ సమగ్ర ‘ఫార్మ్ టు ఇండస్ట్రీ’ ఆయిల్‌పామ్ వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
బుధవారం హైదరాబాద్‌లో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖేతన్ మోడీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం… రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి రెడ్డితో భేటీ అయ్యారు. రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ అర్పన్ బసు, స్టేపుల్స్ విభాగం అధిపతి సంజీవ్ గిరి, ఉద్యానవన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ రైతును వరి సాగు నుంచి మరో పంటవైపు మళ్లించాలంటే కేవలం సూచనలు సరిపోవని తెలిపారు. ప్రత్యామ్నాయ పంట వరికంటే మెరుగైన ఆదాయం ఇవ్వాలన్నారు. మార్కెట్‌పై భరోసా ఉండాలని తెలిపారు. పంట చేతికొచ్చిన వెంటనే కొనుగోలు, ప్రాసెసింగ్‌కు వ్యవస్థ సిద్ధంగా ఉండాల్సిన అవసరముందన్నారు. అప్పుడే పంటల వైవిధ్యీకరణ విజయవంతమవుతుందన్నారు.
కోదాడ–హుజూర్‌నగర్ నుంచే తొలి అడుగు
సూర్యాపేట జిల్లా కోదాడ–హుజూర్‌నగర్ ప్రాంతాన్ని ఆయిల్‌పామ్ ప్లాంటేషన్–ప్రాసెసింగ్ క్లస్టర్‌కు ప్రారంభ కేంద్రంగా పరిశీలించాలని రిలయన్స్ ప్రతినిధులకు ఉత్తమ్ సూచించారు. తదుపరి దశలో ఖమ్మం,కొత్తగూడెం జిల్లాలను కూడా అనుసంధానించడం ద్వారా విస్తృతమైన ముడిసరుకు సేకరణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశాలను అధ్యయనం చేయాలని పేర్కొన్నారు.
ఆయిల్‌పామ్ తోటల విస్తరణ, ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ (ఎఫ్‌ఎఫ్‌బీ) లభ్యత, ప్రాసెసింగ్ సామర్థ్యం, క్రూడ్ పామ్ ఆయిల్ (సీపీవో), పామ్ కెర్నల్ ఆయిల్ ఉత్పత్తి, పామ్ గింజల పెంకులు తదితర ఉప ఉత్పత్తుల వినియోగంతో పాటు భవిష్యత్తులో సబ్బులు, ఇతర పామ్ ఆధారిత వినియోగ, పారిశ్రామిక ఉత్పత్తుల తయారీ వరకు సమగ్ర వ్యవస్థ ఏర్పాటుపై చర్చించినట్లు మంత్రి తెలిపారు.
వరి ఒక్కటే కాదు
రాష్ట్రంలో సాగునీటి సదుపాయాలు విస్తరించడంతో పెద్దఎత్తున వరి సాగవుతోందని తెలిపారు. సాగులో అలవాటు, ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థపై ఉన్న భరోసా కారణంగా అనేక ప్రాంతాల్లో వరి ప్రధాన పంటగా మారిందని చెప్పారు. సాగునీటి వనరులపై వరి సాగు తీవ్ర ఒత్తిడిని పెంచడంతో పాటు ప్రతి ఏటా లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు, రవాణా, మిల్లింగ్, నిల్వ వంటి భారీ బాధ్యతను ప్రభుత్వంపై మోపుతోందని చెప్పారు.
ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులు, వర్షపాతంలో అనిశ్చితి ఈ అవసరాన్ని మరింత స్పష్టంగా చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 3,12,275 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతుండగా, 65,691 మంది రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. ఎన్‌ఎంఈవో -ఓపీ అమలుకు ముందు రాష్ట్రంలో సుమారు 46,325 ఎకరాల్లో మాత్రమే ఆయిల్‌పామ్ ఉండగా, మిషన్ కింద అదనంగా 2,65,950 ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. ఇందుకోసం ఇప్పటివరకు సుమారు రూ.515.84 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో సుమారు 5,753 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతోందన్నారు. అయితే భారీ ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు అవసరమైన ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్‌ను ఒక్క జిల్లా నుంచే సమకూర్చడం సాధ్యం కాకపోవచ్చనన్నారు. ఒకసారి తోట స్థిరపడిన తర్వాత దాదాపు 30 ఏండ్లపాటు రైతుకు ఆదాయాన్ని అందించే సామర్థ్యం దీనికి ఉందని పేర్కొన్నారు.
ఆయిల్‌పామ్‌కు భారీ ప్రోత్సాహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



