నియోజకవర్గంలో ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు…!
నవతెలంగాణ -ముధోల్ ముధోల్ నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలాట కొనసాగుతుందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. నియోజకవర్గంలో ఎవరికి వారే పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు ఆయా మండలాల్లో నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఒకపక్క కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకీ పూర్వవైభవం తీసుకురావాటానికీ రాష్ట్ర నాయకత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది . అయితే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ముధోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో సమన్వయకర్తలుగా పి. రమాదేవి, కిరణ్ క్రోమేవార్ , లోలం శ్యాంసుందర్ లు ఉన్నారు. అలాగే ముధోల్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు, పూర్వ ఇంచార్జీ విలాస్ గాదేవార్ లు పార్టీలో పనిచేస్తున్నారు. అయితే ఏకతాటిపైగా నాయకులు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ప్రజల్లోకి కలిసికట్టుగా తీసుకెళ్లాల్సుండగా, ఎవరికి వారే మండలాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం నియోజకవర్గం లో చర్చకు తావించినట్లయింది. ఒకపక్క బీఆర్ఎస్ కు పూర్వం వైభవం తేవడానికి రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్ పై ఒంటి కాలిపై లేస్తున్నప్పటికీ, నియోజకవర్గంలో మాత్రం సంబంధిత నాయకులు ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు నిర్వహించటం పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ,పలువురు పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు పూర్వం వైభవం రావటానికి అన్ని అవకాశాలున్న, నియోజకవర్గ పార్టీ బాధ్యులైన నాయకులు సక్రమంగా ఉపయోగించుకోవడం లేదన్న అపవాదను మూటకట్టుకుంటున్నారు. ఈ విషయం పై ముధోల్ నియోజకవర్గ పూర్వ ఇంచార్జీ విలాస్ గాదేవార్ ను గురువారం నవతెలంగాణ పోన్లు వివరణ కోరగా మొన్నటి నిరసన కార్యక్రమం సమన్వయ కర్తల ఆధ్వర్యంలో ఆయా మండలాల్లో నిర్వహించిన మాట వాస్తవమే అన్నారు. అంతకు ముందు నిర్వహించిన కార్యక్రమాలు కలిసికట్టుగా నిర్వహించమన్నారు. కొన్ని సందర్భాల్లో పార్టీ ఆదేశాల మేరకు రెండు మండలాల్లో చొప్పున పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహింస్తున్నామన్నారు. కలిసికట్టుగానే పార్టీ కోసం పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ముధోల్ బీఆర్ఎస్ లో మూడు ముక్కలాట..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



