నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి పురపాలక సంఘం పరిధిలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్ -2026) కార్యక్రమంలో భాగంగా గురువారం 1 నుంచి 49వ వార్డులలో వార్డు సభలు నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సభల్లో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచి, ఓటర్ల వివరాలపై అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, పేర్ల తొలగింపు, తప్పులు లేదా ఇతర వివరాల సవరణకు సంబంధించి ఫారం-6, ఫారం-7, ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని అధికారులు ప్రజలకు వివరించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా, ఓటర్ల వివరాలు సక్రమంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (ఎల్‌బీ) ఎన్.వై. గిరి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ టి. పర్వతాలు, స్థానిక కౌన్సిలర్లు, సూపర్‌వైజర్ అధికారులు, వార్డు అధికారులు, బీఎల్‌వోలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్‌పై వార్డు సభలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



