Thursday, August 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనాజీపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

అనాజీపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

- Advertisement -


నవతెలంగాణ – రాయపోల్ : రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని అనాజీపూర్ సర్పంచ్ సోమని నిర్మల ఇస్తారి అన్నారు.గురువారం రాయపోల్ మండలం అనాజిపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సోమని నిర్మల ఇస్తారి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాత రేషన్ కార్డుల స్థానంలో ఆధునిక సాంకేతికతతో రూపొందించిన స్మార్ట్ కార్డులు అందుబాటులోకి రావడం వల్ల రేషన్ సేవలు మరింత సులభతరం కానున్నాయని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ వేణుగోపాల్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి పూర్ణచందర్, అంగన్వాడి టీచర్లు పద్మ,మంజుల, రాధ, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -