Friday, August 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిజయదశమికి రిలీజ్

విజయదశమికి రిలీజ్

- Advertisement -

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘ టనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో విజయ్ దేవరకొండ చేతిలో కత్తితో ఫెరోషియస్ గా కనిపించి ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాకి సమర్పణ – గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్, ప్రొడ్యూసర్స్ – నవీన్ యెర్నేని, రవిశంకర్, స్టోరీ, డైరెక్షన్ – రాహుల్ సంకృత్యన్, కో ప్రొడ్యూసర్స్- అనురాగ్ పర్వతనేని, శివ్ చనన, సీఈవో – చెర్రి, మ్యూజిక్ : అజయ్ – అతుల్, డీవోపీ – నీరవ్ షా, జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ, రైటర్ – ప్రమోద్ తమ్మినేని, ప్రొడక్షన్ డిజైనర్ – శివం రావు నాగసాని, ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్ ఆర్, ఆర్ట్ డైరెక్టర్ – విఠల్ కోసనం, యాక్షన్ కొరియోగ్రాఫర్స్ – యెన్నిక్ బెన్, ఆండీ లాంగ్ గ్యుయెన్, రాబిన్ సుబ్బు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -