Friday, August 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యా, వైద్య రంగాల బలోపేతమే ధ్యేయం: ఎమ్మెల్యే 

విద్యా, వైద్య రంగాల బలోపేతమే ధ్యేయం: ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు, వైద్యాధికారులతో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు ఉన్నత స్థాయి సమీకక్ష‍ా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, పదో తరగతి ఫలితాల మెరుగుదల, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు.

​వైద్యశాఖ అధికారులతో పీహెచ్‌సీల్లో సరిపడా మందుల లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, గర్భిణీలు-చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు. పేదలకు మెరుగైన విద్య, నాణ్యమైన వైద్యాన్ని అందించడమే మన ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -