Friday, August 28, 2026
E-PAPER
Homeఖమ్మంఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల ఇళ్లలో రాఖీ సంబురాలు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల ఇళ్లలో రాఖీ సంబురాలు

- Advertisement -

– తోబుట్టువులతో సందడిగా రక్షాబంధన్ వేడుకలు
నవతెలంగాణ – అశ్వారావుపేట

రాఖీ పౌర్ణమి సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల నివాసాల్లో శుక్రవారం రాఖీ సంబురాలు ఘనంగా జరిగాయి. తోబుట్టువులు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్యే జారె ఇంట్లో..
దమ్మపేట మండలం గండుగులపల్లి లోని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నివాసానికి గండుగులపల్లి లోని తన పెద్ద సోదరి కుర్సం ముత్తమ్మ,ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారానికి చెందిన చిన్న సోదరి ఊకే కమల కలిసి చేరుకున్నారు.ఈ సందర్భంగా ముత్తమ్మ, కమల లు ఎమ్మెల్యే జారె ఆదినారాయణకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యుల మధ్య వేడుకలు ఆనందోత్సాహంగా సాగాయి.

మాజీ ఎమ్మెల్యే మెచ్చా నివాసంలో..
అశ్వారావుపేట మండలం తాటి సుబ్బన్నగూడెంలోని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నివాసంలోనూ రాఖీ వేడుకలు నిర్వహించారు. ఆయన పెద్ద సోదరి సీతమ్మ, చిన్న సోదరి సుదర్శనమ్మ ఇంటికి చేరుకుని మెచ్చా నాగేశ్వరరావుకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే తాటి గృహంలో..
దమ్మపేట మండలం మందలపల్లిలోని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు నివాసంలో రాఖీ పండుగ సందడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం మర్రిగూడెం పంచాయతీ లంకాలపల్లికి చెందిన ఆయన తోబుట్టువు బుచ్చమ్మ ఇంటికి చేరుకుని తాటి వెంకటేశ్వర్లుకు రాఖీ కట్టి ఆప్యాయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -