Friday, August 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులు, రైళ్లు 

కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులు, రైళ్లు 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను
రాఖీ పండుగను పురస్కరించుకొని ఆలేరు పట్టణం మీదుగా హైదరాబాద్, వరంగల్ ప్రధాన నగరాలను కలుపుతూ వివిధ ప్రాంతాలకు వెళ్లే మహిళ ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు, రైళ్లు శుక్రవారం కిక్కిరిసి పోయాయి. బస్సులు సకాలంలో రాలేదని ప్రయాణికులు, గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం 28 నుండి సోమవారం 31 వరకు ప్రభుత్వం అదనపు బస్సులను నడుపుతోందని చెబుతున్నప్పటికీ, పట్టణంలోని బస్టాండ్ వద్ద ఆ పరిస్థితి కనబడలేదు. 

బస్టాండ్లలో త్రాగునీరు, ప్యాన్‌లు, కనీసం మౌలిక వసతులు లేవని వాపోయారు. హైదరాబాద్ జటద్గిరిగుట్ట నుండి జనగామ వైపు బయలుదేరిన బస్సులు, ఆలేరు పట్టణానికి కేవలం రెండు నుండి రెండున్నర గంటల సమయంలో రావాల్సిది.. ట్రాఫిక్ రద్దీ కారణంగా దాదాపు 4 గంటలు ప్రయాణించాల్సి వచ్చిందని ప్రయాణికులు వాపోయారు. సీట్లు దొరకక గంటల తరబడి పిల్లాపాపలతో కలిసి ప్రయాణం నరకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పల్ నుండి భువనగిరి, ఆలేరు, జనగామ ,స్టేషన్గన్పూర్, హనుమకొండ, వరంగల్ పట్టణాల మీదుగా, వివిధ పట్టణాలకు, గ్రామాలకు   వెళ్లే ప్రయాణికులు ప్రయాణం సాఫీగా జరగలేదని తెలియజేశారు.

హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఏర్పడింది. ప్రభుత్వ బస్సులతోపాటు ప్రైవేట్ వాహనాలు కార్లు ద్విచక్ర వాహనాలలో ప్రయాణికులు ఒక చోట నుండి మరోచోటికి చేరుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి నుండి కాజీపేట, వరంగల్, బల్లార్షా, విజయవాడ, వైపే వెళ్లే రైళ్లు ఇంటర్సిటీ, తెలంగాణ ఎక్స్ ప్రెస్‌,కృష్ణ, ఎక్స్ ప్రెస్‌, పుష్పుల్ ప్యాసింజర్, గోల్కొండ ఎక్స్ ప్రెస్‌ లు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌ ప్రయాణికులతో కిక్కిరిసి పోయాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -