Friday, August 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరు ఎమ్మెల్యే నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు

ఆలేరు ఎమ్మెల్యే నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను 
రాష్ట్ర ప్రభుత్వ విప్పు, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నివాసంలో శుక్రవారం ఆలేరు నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆడపడుచులు, మహిళలు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనితలకు రాఖీలు కట్టి, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఆప్యాయత, అనురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా ఆడపడుచులు చూపిన ప్రేమాభిమానాలకు బీర్ల అయిలయ్య  కృతజ్ఞతలు తెలిపారు. బీర్ల ఫౌండేషన్ చైర్‌పర్సన్ బీర్ల అనిత అన్నదమ్ములకు రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత, అనుబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి పండుగ ప్రతి కుటుంబంలో సంతోషాలను నింపాలని, అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఆప్యాయతలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని వారు ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -