నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
పిఆర్టియు జిల్లా ఎన్నికల యందు ఏం మలుపు తిరగనుందో అనే విధంగా రసవత్తరంగా కొనసాగుతుంది అందులో భాగంగానే ఈ నెల 30వ తేదీన పిఆర్టియు జిల్లా ఎన్నికలు నిర్వహించినున్నారు. అందుకు ముందుగానే జిల్లాలో ఉన్న మండలాల యందు నూతన మండల కమిటీలను ఎన్నుకున్నారు. నూతనంగా ఏర్పడిన మండల కమిటీల కార్యవర్గ సభ్యులందరూ కలిసి 366 మంది ఆదివారం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులో ఎవరికి ఓటు వేసి గెలిపిస్తారు అని ఉపాధ్యాయ సంఘం లో రసవత్తరం కొనసాగుతుంది. అందులో ముఖ్యంగా ఎవరైతే జిల్లా కమిటీలో నిలబడి గెలుపొందాలని అనుకుంటున్నారో వారు ముందుగానే వారికి సంబంధించిన వారిని మండల కమిటీలలో గెలిపించుకొనుటకు శతవిధాల ప్రయత్నాలు కొనసాగించారు. ఉపాధ్యాయులు ఎందులోనూ ఎవరికి తీసిపోరు అనే విధంగా సాధారణ ఎన్నికలు తలపించే విధంగా ఉపాధ్యాయులను మచ్చిక చేసుకున్నారు అని సంఘం నాయకులు అంటున్నారు.
అందులో భాగంగానే ఓ మండల కమిటీ ఎన్నికల యందు ఒక సీనియర్ పిఆర్టియు నాయకుడు “నువ్వు అప్పుడే పెద్దవాడివి అయిపోయావా… నువ్వు ఎలా గెలుస్తావో” అని బెదిరించారు అని, చివరికి ఆ మండలంలోని ఆ నాయకుడే 6 ఓట్లతో గెలుపొందాడని… అదే జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది, ఇప్పుడు అదే అంశం జిల్లా ఎన్నికల యందు మలుపు తిప్పే అవకాశాలు ఉన్నాయని ఉపాధ్యాయ సంఘం సభ్యులు చర్చించుకుంటున్నారు.
నేటికీ పిఅర్టీయు ఉపాధ్యాయ సంఘం లోని ప్రాథమిక సభ్యుడికి న్యాయం జరిగడం లేదు అని, పిఆర్టియు నిబంధనల ప్రకారం బైలా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని, ప్రభుత్వ పాఠశాలలను అలోపేతం చేయకుండా యూనియన్ నిబంధ నలను పూర్తిగా విస్మరిస్తూ ఓ రాజకీయ నాయకుడు యొక్క ధోరణిలో తోటి ఉపాధ్యాయులను బెదిరింపులకు పాల్పడుతున్నారని యూనియన్ నాయకులకు అపవాదం మూటగట్టుకుంటున్నారు.
అంతేకాకుండా కొందరు యూనియన్ నాయకులు మేము రాష్ట్ర కమిటీలోకి వెళ్తున్నాము అని చెప్తూనే…, జిల్లా కమిటీలో పోటీకి సిద్ధమవుతున్నారు కాగా ఆ యూనియన్ లో ఉన్న మిగతా సభ్యులకు, నాయకులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదని నూతన నాయకులకు అవకాశాలు అందించడం లేదు, రాష్ట్రంలోకి వెళ్లాలనుకునే నాయకులకు జిల్లా సహకారం కచ్చితంగా అవసరం, ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇతరులకు పోటీ చేసేందుకు సపోర్ట్ గా నిలుస్తే రానున్న రోజులలో జిల్లా కమిటీ ఆ నాయకునకు సహకారం అందించేందుకు అవకాశాలు ఉంటాయి అని సంఘము సభ్యులు అంటున్నారు.
ఇటువంటి తరుణంలో పిఆర్టియు జిల్లా ఎన్నికలలో చివరి క్షణం లో అనూహ్యంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పదవులకు పోటీ చేసేందుకు అవకాశాలు లేకపోలేదు. గతంలో కొందరు నాయకులు వారి గెలుపు అందుకునుటకై చివరి క్షణం వరకు కొన్ని ఎత్తుగడలను వేశారు. అదేవిధంగా ఈ పిఆర్టియు జిల్లా ఎన్నికల యందు ఏ క్షణంలో… ఏం మలుపు తిరుగుతుందో అనే విధంగా వ్యూహాలు జరుగుతున్నాయని పిఆర్టియు సభ్యులు చేర్చించుకుంటున్నారు.



