Sunday, August 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రక్షా బంధన్ వేడుకల్లో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఉమారాణి శ్రీనివాస్

రక్షా బంధన్ వేడుకల్లో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఉమారాణి శ్రీనివాస్

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
రక్షా బంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి  సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజుకు రాఖీ కట్టి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షా బంధన్ పండుగ అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ప్రేమానుబంధాలకు ప్రతీక అని ఉమారాణి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోదర, సోదరీమణుల మధ్య ఆప్యాయత, అనురాగాలు ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు. రాఖీ అంటే కేవలం ఒక దారం కాదని, సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలకు చిరస్థాయిగా నిలిచే గుర్తు అని అన్నారు. జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటూ కష్టసుఖాల్లో అండగా నిలిచే ఆత్మీయ బంధమే సోదర, సోదరీమణుల బంధమని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -