
నవతెలంగాణ – అశ్వారావుపేట : తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఆనందోత్సవాల తో జరుపుకుని సంక్రాంతి పండుగ వేడుకలను ముందస్తుగా విద్యార్థులు పాఠశాలల్లో జరుపుకుని తెలుగు పండుగ సంప్రదాయాన్ని,సంస్క్రుతి నీ ప్రదర్శించారు. గురువారం పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలతో పాటు పలు ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి. హరిత,ఉపాధ్యాయులు నర్సింహ రావు, సలీమ్, కిషోర్, కేఆర్సి ప్రసాద్, రామిరెడ్డి, బాలస్వామిలు పాఠశాల ఆవరణలో భోగిమంటలు ఏర్పాటు చేసారు.
ఈ భోగి మంటల చుట్టూ విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణ తో ,నృత్యాలు చేసి అలరించారు.సాయంత్రం విద్యార్ధినులు రంగవల్లులు అద్దిన తీరు చూపరులను ఆకట్టుకుంది.