Saturday, August 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయందౌత్య యత్నాలు ప్రారంభించండి

దౌత్య యత్నాలు ప్రారంభించండి

- Advertisement -

ఇరాన్‌ను కోరిన ఖతార్ ప్రధాని
అమెరికాను కట్టడి చేయాలని సూచించిన టెహ్రాన్

టెహ్రాన్ : ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్‌రహమాన్ అల్ థానీ గురువారం ఖతార్‌లో పర్యటించారు. మధ్యప్రాచ్యంలో నిలిచిపోయిన దౌత్య యత్నాలను తిరిగి ప్రారంభించేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇరాన్ నేతలతో చర్చలు జరపబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అర్థవంతమైన చర్చలకు ఇరాన్ ముందుకు వచ్చేంత వరకూ ఆ దేశంపై ఆర్థిక యుద్ధాన్ని కొనసాగిస్తామని చెప్పారు. కాగా ఇరాన్ చర్చల ప్రతినిధి మహమ్మద్ బాఖర్ ఖలీబఫ్‌తో ఖతార్ ప్రధాని చర్చలు జరిపారు. దౌత్య యత్నాలను తిరిగి ప్రారంభించాలని కోరారు. తమ భూభాగాలను సైనిక లేదా ఆర్థిక దాడులకు ఉపయోగించుకోకుండా అమెరికాను పొరుగు దేశాలు నిలువరించాలని ఈ సందర్భంగా కోరామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ఒత్తిడులు పనిచేయబోవని అమెరికా గుర్తిస్తేనే దౌత్యం తిరిగి పట్టాల పైకి ఎక్కుతుందని ఆయన అన్నారు. అమెరికా ముందుగా విశ్వాసాన్ని నెలకొల్పాలని, మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, ఇరాన్ హక్కులను గుర్తించాలని, హామీలను అమలు చేయాలని హితవు పలికారు. ఖతార్ ప్రధానితో ‘సృజనాత్మక చర్చలు’ జరిపానని చెప్పారు. తమపై అమెరికా దూకుడు ప్రదర్శిస్తే దాని సైనిక, ఆర్థిక ప్రయోజనాలపై దాడి చేస్తామని ఇరాన్ సుప్రీం జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహసేన్ రెజాయి ఖతార్ ప్రధానికి తెలియజేశారు.

షరతులు సిద్ధం చేస్తున్నాం
హార్ముజ్ జలసంధిని తెరవాలని మధ్యవర్తులు కోరిన నేపథ్యంలో ఆ పని చేసేందుకు షరతుల జాబితాను రూపొందిస్తున్నామని రెజాయి తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చేందుకు అమెరికా ఆచరణాత్మక చర్యలు చేపట్టాలని, ఆ తర్వాతే జలమార్గాన్ని తెరుస్తామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -