ఏడు నెలల్లో 17.6 శాతం వృద్ధి
బీజింగ్ : చైనా పారిశ్రామికోత్పత్తి పరు గులు పెడుతోంది. దేశంలో నూతన ఆవిష్క రణల ఆధారిత అభివృద్ధి జోరుగా సాగుతుం డటంతో పారిశ్రామిక లాభాల్లో అసాధారణ వృద్ధి నమోదయ్యిందని చైనా జాతీయ గణాంక బ్యూరో (ఎన్‌బిఎస్) ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఈ ఏడాది (2026) తొలి ఏడు నెలల్లో (జనవరి-జులై) చైనాలో నిర్దేశిత పరిధి కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ కలిగిన పారిశ్రామిక సంస్థల లాభాలు గతేడాదితో పోలిస్తే 17.6 శాతం వృద్ధిని సాధించాయి. కనీసం 20 మిలియన్ యువాన్ల వార్షిక ప్రధాన వ్యాపార రాబడి కలిగిన ఈ సంస్థల సంయుక్త లాభాలు జనవరి-జులై కాలంలో 4.58 ట్రిలి యన్ యువాన్లకు చేరుకున్నాయి. మైనింగ్ పరిశ్రమ లాభాలు 34.9 శాతం పెరిగి 666.05 బిలియన్ యువాన్లకు చేరగా, తయారీ రంగం లాభాలు 18.8 శాతం వృద్ధితో దాదాపు 3.44 ట్రిలియన్ యువాన్లకు చేరాయి.
చైనా పారిశ్రామికం పరుగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



