నేపాల్‌లో 547కు చేరిన మృతులు
ఖాట్మండు : నేపాల్‌లో పెను విషాదాన్ని మిగిల్చిన వరదలలో మరణించిన వారి సంఖ్య శుక్రవారం 547కు చేరింది. సహాయ కార్యక్రమాలు కొనసాగు తుండడంతో శిధిలాల నుంచి మరిన్ని మృతదేహాలు బయటపడుతున్నాయి. భొటెకోషి నది ప్రాంతంలో నీటి మట్టం పెరుగుతుండడంతో మరోసారి వరద ముప్పు పొంచి ఉన్నదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం ఆకస్మికంగా ముంచుకొచ్చిన వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిన ప్రదేశంలో నీటి మట్టాలు పెరుగుతున్నాయని, దీంతో ఆ ప్రాంతంలో మళ్లీ వరదలు సంభవించే అవకాశం ఉన్నదని నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఆరఆరఎంఏ) తెలిపింది. బుధవారం వరదలు సంభవించిన ప్రాంతంలోనే బురదతో కూడిన నీటి మట్టం పెరిగిందని, కాబట్టి ఆ ప్రదేశాన్ని మరోసారి వరద నీరు ముంచెత్తవచ్చునని హెచ్చరించింది.
భారత పర్యాటకులను కలిసిన రాయబారి
వరదల కారణంగా హిమాలయ ప్రాంతాల నుంచి ఖాళీ చేయించిన భార తీయ పర్యాటకులను నేపాల్‌లోని భారత రాయబారి శ్రీవాత్సవ శుక్రవారం కలుసు కున్నారు. ఇండిగో విమానంలో ఖాట్మండు నుంచి భారత్‌కు బయలుదేరిన పర్యాటకులకు ఆయన త్రిభువన్ అంతర్జా తీయ విమానాశ్రయంలో వీడ్కోలు పలి కారు. ఇదిలావుండగా టిబెట్‌లోని చైనా – నేపాల్ సరిహద్దులో సంభవించిన వరదల్లో ఐదుగురు చనిపోయారని, 260 మంది విదేశీయులు సహా 558 మంది జాడ తెలియడం లేదని చైనా తెలిపింది. కాగా విపత్తు సహాయ నిధికి నెల జీతం విరాళంగా అందించాలని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా, ఆయన క్యాబినెట్ సహచరులు నిర్ణయించారు. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఖాట్మండు పోస్ట్ పత్రిక తెలియజేసింది. ఆకస్మిక వరదలలో నష్టపోయిన వ్యక్తులు, వ్యాపారుల కోసం సహాయ, ఆర్థిక, పునరావాస ప్యాకేజీని రూపొందించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను క్యాబినెట్ ఆదేశించింది.
పొంచి ఉన్న మరో వరద ముప్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



