Saturday, August 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయూఎస్ పోస్టల్ సర్వీస్‌కు షాక్

యూఎస్ పోస్టల్ సర్వీస్‌కు షాక్

- Advertisement -

మెయిల్ ఓటింగ్ ప్రణాళిక అమలుకు బ్రేక్
బోస్టన్
: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేస్తున్న కార్యనిర్వాహక ఉత్తర్వులకు న్యాయస్థానాలలో చుక్కెదురు అవుతూనే ఉంది. మెయిల్ ఓటింగును పరిమితం చేస్తూ ఆయన జారీ చేసిన ఉత్తర్వును రెండు వారాల పాటు అమలు చేయకుండా యూఎస్ పోస్టల్ సర్వీసును (యూఎస్‌పీఎస్) బోస్టన్‌లోని ఫెడరల్ జడ్జి నిలువరించారు యూఎస్‌పీఎస్ నిబంధనల అమలును డెమొక్రటిక్ పాలిత రాష్ట్రాలు, ఓటర్ అడ్వొకసీ గ్రూపులు న్యాయస్థానంలో సవాలు చేశాయి. పిటిషన్లపై విచారణ జరిపిన అనంతరం యూఎస్‌పీఎస్ నిబంధన అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ బోస్టన్ న్యాయమూర్తి గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, దీనిని జారీ చేసే అధికారం యూఎస్‌పీఎస్‌కు లేదని పిటిషనర్లు చేస్తున్న వాదనకు అంతిమంగా విజయం చేకూరే అవకాశం ఉన్నదని న్యాయమూర్తి ఇందిరా తల్వానీ చెప్పారు. నిబంధనలపై ప్రాథమిక ఇంజక్షన్ ఆదేశాలు ఇవ్వాలా వద్దా అనే అంశంపై వచ్చే గురువారం ఆమె విచారణ జరుపుతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -