ఢాకా : చైనా నుంచి 2.3 బిలియన్ డాలర్ల విలువైన ఇరవై జే – 19 సీఈ బహుళ ప్రయోజక యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. బంగ్లాదేశ్ జరిపిన అతి పెద్ద రక్షణ కొనుగోళ్లలో ఇది కూడా ఒకటి కాబోతోంది. గత సంవత్సరం ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనాకు చెందిన జే- 10 విమానాల పనితీరును గమనించిన బంగ్లాదేశ్ ఈ నిర్ణయానికి వచ్చింది. బంగ్లాదేశ్ వైమానిక దళాన్ని ఆధునీకరిం చాలని తారిఖ్ రెహమాన్ ప్రభుత్వం అనుకుం టోంది. మూల ధర 62.7 మిలియన్ డాలర్ల కంటే చాలా ఎక్కువగా ఒక్కో యుద్ధ విమానం కొనుగోలుకు సుమారు 115 మిలియన్ డాలర్లు వెచ్చించాలని ప్రతిపా దించింది. అదనపు వ్యయంలో శిక్షణ, పరికరాలు, సాంకేతిక- లాజిస్టిక్ మద్దతు, రవాణా, బీమా, వ్యాట్, నిర్మాణ పనులు కలిసి ఉంటాయి. కాగా చైనా నుంచి యుద్ధ విమానా లను కొనుగోలు చేస్తున్న సమాచారాన్ని బంగ్లాదేశ్ ప్రధాని సమాచార, ప్రసార సలహాదారు జాహెద్ ఉర్ రెహమాన్ ధృవీకరించారు.
చైనా యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్న బంగ్లాదేశ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



