- Advertisement -
ఎమ్మార్పీఎస్ నాయకులు యాదవ్ సూర్య వంశీ
నవతెలంగాణ-మద్నూర్
ఈనెల 30న ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు డోంగ్లి మండలంలోని హసన్ టాక్లి గ్రామంలో అన్నా బహు సాటే విగ్రహవిష్కరణ ఉంటుందని, ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనాలు తరలిరావాలని ఎమ్మార్పీఎస్ జుక్కల్ నియోజకవర్గం నాయకులు యాదవ్ సూర్య వంశీ ఒక ప్రకటన ద్వారా కోరారు. ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు మాదిగ జాతి కులస్తులు భారీ సంఖ్యలో తరలిరావాలని మందకృష్ణ మాదిగకు స్వాగతం పలకాలని కోరారు. హసన్ టాక్లి గ్రామంలో అన్నా బహు సాటే విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
- Advertisement -



