నవతెలంగాణ – బీబీపేట
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం లో సభ్యుడిగా ఉన్న సాలిమెడ శ్రీనివాస్ మరణించడంతో ఆయన భార్య ఉజ్జీవ కి రూ.2 లక్షల బీమా పరిహారం అందజేశారు. బీబీపేట యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో శనివారం బీమా మొత్తానికి సంబంధించిన చెక్కును ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంకు బీబీపేట శాఖ మేనేజర్ హర్షద్ అలీ, ఉప మేనేజర్ కృష్ణప్రసాద్, క్షేత్ర అధికారి మనోజ్, యశ్వంత్, ఆనంద్, జనగామ బ్యాంకింగ్ కరస్పాండెంట్ లలిత లింగం, ఇతర బ్యాంకు సిబ్బంది పాల్గొని ఉజ్జీవకు రూ.2 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు మాట్లాడుతూ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా తక్కువ ప్రీమియంతో కుటుంబాలకు జీవిత బీమా రక్షణ లభిస్తుందని తెలిపారు. అనుకోని పరిస్థితుల్లో బీమా చేసిన వ్యక్తి మరణిస్తే నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులకు బీమా మొత్తం అందుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని తమ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించుకోవాలని సూచించారు. బీమా మొత్తం అందడంతో మృతుడి కుటుంబ సభ్యులు బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
పీఎంజేజేబీవై ద్వారా రూ.2 లక్షల బీమా చెక్కు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



