Saturday, August 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంటలను పరిశీలించిన ఇంచార్జీ ఏఓ రాజు

పంటలను పరిశీలించిన ఇంచార్జీ ఏఓ రాజు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని గుండూరు గ్రామంలో వానకాలంలో సాగు చేస్తున్న పంటలను మండల వ్యవసాయ అధికారి రాజు శనివారం పరిశీలించారు. ముఖ్యంగా పత్తి పంటలో రసం పీల్చే పురుగులు పెనుబంక, పచ్చ దోమల నివారణకు ఏసిపెట్ 400 గ్రాము, లేదా ఎసిటామీప్రీడ్ 400 గ్రాము, తయోమితాక్సం 40 గ్రాము, లేదా అసెఫేట్ +ఇమిడక్లోప్రిడ్ 400 గ్రాము, ఎకరాకు పిచికారి చేయాలని సూచించారు. అలాగే వానకంలో సాగు చేస్తున్న పంటలను ఆయా గ్రామాల ఏఈవోలు డిజిటల్ క్రాప్ సర్వే ఆధారంగా పంటలను నమోదు చేయాలని సూచించారు. రైతులకు మండలంలో సరిపడా ఎరువులు అందుబాటులో ఉందని, రైతులు ఫెర్టిలైజర్ యాప్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకొని ఎరువులు తీసుకోవచ్చని చెప్పారు. మండలంలో సొసైటీ మరియు ప్రైవేట్ ఎరువుల దుకాణాలను పరిశీలించి రైతులకు ఆన్లైన్ బుకింగ్లో ఇబ్బంది కలగకుండా చూడాలని, యాప్ గురించి తెలియని రైతులు వస్తె వారికి డీలర్ స్వయంగా బుక్ చేసి ఏరావులు ఇవ్వాలని ఎరువుల దుకాణాల యజమానులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -